మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 06, 2020 , 17:59:28

భారీ వర్షాలకు కూలిన కొత్త వంతెన

భారీ వర్షాలకు కూలిన కొత్త వంతెన

అహ్మదాబాద్: ఇటీవల కొత్తగా నిర్మించిన ఒక వంతెన భారీ వర్షాలకు కూలిపోయింది. గుజరాత్ రాష్ట్రంలో ఈ ఘటన జరిగింది. జునాగఢ్ జిల్లాలోని బామ్నాసా గ్రామంలో ఒక కాలవ మీదుగా కొన్ని నెలల కిందట కొత్త వంతెనను నిర్మించారు. కాగా ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఆ వంతెన కూలి విరిగిపోయింది.

మరోవైపు కొత్త వంతెన కొన్ని నెలల్లోనే కూలిపోవడంపై బామ్నాసా గ్రామస్తులు మండిపడుతున్నారు. వంతెనను నాసిరకంగా నిర్మించారని వారు ఆరోపిస్తున్నారు. సంబంధిత కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  

logo