టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. థమన్ మ్యూజిక్ ను ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తుంటారు. అల వైకుంఠపురంలో సామజవరగమన అంటూ తన మ్యూజిక్‌తో సెన్సేషన్ సృష్టించాడు. ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ఇపుడు అమెరికాలో లైవ్ ప్రోగ్రామ్ (మ్యూజికల్ కాన్సర్ట్) ఇవ్వబోతున్నాడు. లెజెండరీ డ్రమ్మర్ శివమణి, ప్రముఖ ఫ్లూట్ ప్లేయర్ నవీన్‌తో కలిసి లైవ్ కాన్సర్ట్ ఇవ్వనున్నాడు. ఈవెంట్ ప్రోమోను అల్లు అర్జున్ షేర్ చేశాడు. ప్రోమోలో థమన్ స్టైలిష్ ఎంట్రీతో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు.
అల వైకుంఠపురంలో చిత్రంతో జనాలు థమన్ మ్యాజిక్ చూశారు. అల అమెరికాపురంలో మరోసారి లైవ్‌లో ఆ మ్యాజిక్ ను అనుభవించడానికి రెడీ కండి. యూఎస్ ప్రజలు తప్పకుండా నేను ఎంజాయ్ చేసినదానికంటే ఎక్కువ ఈ ప్రోగ్రామ్‌ను ఎంజాయ్ చేస్తారు. నా సోదరుడు థమన్ కు ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేశాడు. హంసినీ ఎంటర్ టైన్ మెంట్స్ మ్యూజికల్ షోను ఆర్గనైజ్ చేస్తోంది. అమెరికాలో ప్రధాన నగరాల్లో ఈ షోలో నిర్వహించబోతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇంట్రెస్టింగ్ గా నందమూరి హీరో ప్రీ లుక్
ఆర్ఆర్ఆర్ నిర్మాతతో నాగచైతన్య సినిమా..!
కొత్తింట్లోకి ‘రాఖీభాయ్’..ఫొటోలు వైరల్
రోజుకు ఎన్ని సిగరెట్లు తాగుతారు..రష్మికకు అభిమాని ప్రశ్న
నాలో మూడు మార్పులొచ్చాయి : సమంత
వెకేషన్ డేస్‌ను గుర్తు చేసుకున్న రకుల్..స్టిల్స్ వైరల్