సోమవారం 30 నవంబర్ 2020
National - Nov 09, 2020 , 11:48:59

పోలీసుల క‌ళ్ల‌లో కారం కొట్టిన త‌ల్లి.. పారిపోయిన కొడుకు

పోలీసుల క‌ళ్ల‌లో కారం కొట్టిన త‌ల్లి.. పారిపోయిన కొడుకు

ముంబై: ఓ కేసులో నిందితుడైన వ్య‌క్తిని ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు అత‌నికి ఇంటికి వెళ్లారు. దీంతో త‌న కొడుకు పారిపోవ‌డానికి అనువుగా  అత‌ని తల్లి పోలీసుల క‌ళ్ల‌లో కారం చ‌ల్లింది. అనంత‌రం ఇద్ద‌రినీ అరెస్టు చేసిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. 

ముంబైలోని మ‌ల్వానిలో ఉన్న అంబుబ్‌వాడీ ప్రాంతానికి చెందిన ఓ నిందితున్ని అరెస్టు చేయ‌‌డానికి ఇద్ద‌రు పోలీసులు గ‌త శుక్ర‌వారం వెళ్లారు. ఇది గ్ర‌హించిన అత‌ని త‌ల్లి పోలీసుల క‌ళ్ల‌లో కారం చ‌ల్లింది. దీంతో అత‌డు పోలీసుల‌కు చిక్క‌కుండా పారిపోయాడు. కాగా, పారిపోయిన ఆ నిందితున్ని, అత‌నికి స‌హ‌క‌రించిన త‌ల్లిని మ‌లాడ్ ప్రాంతంలో పోలీసులు అరెస్టు చేశారు. వారిద్ద‌రిపై ఐపీసీ 353, 332, 504, 506, 509 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదుచేశారు. ‌