గురువారం 28 మే 2020
National - May 08, 2020 , 12:46:51

కుప్పకూలిన మిగ్‌-29 ఎయిర్‌క్రాఫ్ట్‌.. పైలట్‌ సురక్షితం

కుప్పకూలిన మిగ్‌-29 ఎయిర్‌క్రాఫ్ట్‌.. పైలట్‌ సురక్షితం

న్యూఢిల్లీ : పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జలంధర్‌కు సమీపంలోని ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌ నుంచి బయల్దేరిన మిగ్‌-29 ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ కుప్పకూలిపోయింది. ఈ ఘటన పంజాబ్‌లోని హోసియార్‌పూర్‌ జిల్లాలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడు. ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం వల్లే ప్రమాదం సంభవించినట్లు ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాద ఘటనపై దర్యాప్తుకు అధికారులు ఆదేశించారు. 


logo