శనివారం 29 ఫిబ్రవరి 2020
పుల్వామా అమరుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు

పుల్వామా అమరుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు

Feb 14, 2020 , 10:41:14
PRINT
పుల్వామా అమరుల జ్ఞాపకార్థం స్మారక చిహ్నం ఏర్పాటు

జమ్ముకశ్మీర్‌: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల జ్ఞాపకార్థం స్మారక చిహ్నంను ఏర్పాటు చేశారు. దాడి జరిగిన ప్రాంతం లేథిపురా వద్దనే జవాన్ల పేర్లు, ఫోటోలతో కూడిన స్మారక చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. గతేడాది ఇదే రోజు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై ఉగ్రదాడి జరగడంతో 40 మంది జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ సంఘటన జాతి యావత్తును కలిచివేసింది. అమర జవాన్ల జ్ఞాపకార్థ స్మారక చిహ్నంను ఏర్పాటు చేశారు. ఈ స్మారక చిహ్నం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా మహారాష్ట్ర నుండి ఉమేష్‌ గోపినాథ్‌ జాదవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపినాథ్‌ జాదవ్‌ స్పందిస్తూ.. నేనెంతో గర్వపడుతున్నా. పుల్వామా అమరుల కుటుంబాలన్నింటిని కలిశాను. దేశవ్యాప్తంగా 61 వేల కిలోమీటర్ల తిరిగి మృతిచెందిన 40 మంది జవాన్ల కుటుంబాలను కలిశాను. వారి ఆశీస్సులు తీసుకున్నాను. తల్లిదండ్రులు వారి కొడుకులను, భార్యలు వారి భర్తలను, పిల్లలు వారి తండ్రులను, స్నేహితులు వారి స్నేహితులను కోల్పోయారు. అమర జవాన్ల సమాదుల నుంచి మట్టిని తీసుకువచ్చా. ఈ పవిత్ర మట్టిని స్మారకచిహ్నం వద్ద ఉంచుతున్నట్లు తెలిపారు. 


logo