ఆదివారం 12 జూలై 2020
National - Jun 19, 2020 , 07:42:37

తండ్రి కోరిక మేర‌కు.. దిష్టిబొమ్మ‌తో వివాహం

తండ్రి కోరిక మేర‌కు.. దిష్టిబొమ్మ‌తో వివాహం

ల‌క్నో : పెళ్లి అన‌గానే అంద‌మైన అమ్మాయి గుర్తుకువ‌స్తుంది. అందాల సుంద‌రాంగిని పెళ్లి చేసుకోవాల‌ని ప్ర‌తి యువ‌కుడు క‌ల‌లు కంటాడు. అలాంటి అప్స‌ర‌స కోసం వెతుకుతుంటారు. కానీ ఓ యువ‌కుడు మాత్రం అమ్మాయిని పోలిన దిష్టిబొమ్మ‌ను వివాహం చేసుకున్నాడు. 

ప్ర‌యాగ్ రాజ్ కు చెందిన శివ‌మోహ‌న్(90)కు తొమ్మిది సంతానం. వీరంద‌రికి పెళ్లి కాగా, చిన్న కుమారుడైన పంచ‌రాజ్(32)కు వివాహం కాలేదు. ఎందుకంటే అత‌నికి పెద్ద‌గా ఆస్తి లేదు. అందులోనూ మాన‌సిక విక‌లాంగుడు. కానీ త‌న చిన్న‌కుమారుడికి పెళ్లి చేసి తీరాల్సిందేన‌ని తండ్రి సంక‌ల్పించాడు. దీంతో త‌న కుమారుడిని ఒప్పించి.. పెళ్లి కుమార్తెను పోలిన దిష్టిబొమ్మ‌తో వివాహం జ‌రిపించాడు. 

ఈ పెళ్లి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం.. వివాహం జ‌రిపించి.. తండ్రి త‌న ముచ్చ‌ట తీర్చుకున్నాడు. వివాహ వేడుక‌కు హాజ‌రైన వారంద‌రికీ కూడా విందు ఏర్పాటు చేశారు. అయితే ఈ పెళ్లిని మొద‌ట పంచరాజ్ తిర‌స్క‌రించాడు. చివ‌ర‌కు తండ్రి కోరిక మేర‌కు, ఆయ‌న గౌర‌వాన్ని నిల‌బెట్టేందుకు దిష్టి బొమ్మ‌తో పెళ్లి చేసుకునేందుకు సిద్ధ‌మ‌య్యాడు. 


logo