శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 19, 2020 , 15:54:10

బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు

బాలికను కిడ్నాప్ చేసిన వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు

చండీగఢ్: బాలికను కిడ్నాప్ చేసిన ఒక వ్యక్తిని స్థానికులు చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. అతడి మెడలో చెప్పుల దండ వేశారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. లూధియానాలోని బోంకర్ గుజ్రాన్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి శనివారం ఒక మైనర్ బాలికను కిడ్నాప్ చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అతడ్ని పట్టుకుని చెట్టుకు కట్టేసి చితక్కొట్టారు. అతడి మెడలో చెప్పుల దండ వేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. మరోవైపు ఆ వ్యక్తిని దారుణంగా కొట్టిన నలగురు గ్రామస్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను తమకు అప్పగించాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వారిని కొట్టడం తగదని చెప్పారు.
logo