గురువారం 28 మే 2020
National - May 13, 2020 , 10:21:18

33 ఏండ్ల క్రితం త‌ల్లిని చంపాడు.. ఇప్పుడు కొడుకును చంపేశాడు

33 ఏండ్ల క్రితం త‌ల్లిని చంపాడు.. ఇప్పుడు కొడుకును చంపేశాడు

న్యూఢిల్లీ: మ‌ద్యం తాగొద్ద‌ని హెచ్చ‌రించినందుకు 33 ఏండ్ల క్రితం ఓ వ్య‌క్తి క‌న్న త‌ల్లినే కొట్టి చంపాడు. ఇప్పుడు మ‌ద్యం విష‌య‌మై భార్య‌తో గొడ‌వ‌ప‌డుతుండ‌గా అడ్డ‌కున్నందుకు క‌న్న కొడుకునే తుపాకీతో కాల్చి చంపేశాడు.  దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం ఈ ఘ‌ట‌న‌ చోటుచేసుకుంది.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం.. ఢిల్లీలోని రోహినీ ఏరియాకు చెందిన ప్రాపర్టీ డీలర్‌ ఓమ్‌పాల్‌ మద్యానికి బానిసగా మారాడు. 1987లో మద్యం తాగొద్దని హెచ్చరించిన తల్లి మాయాదేవిని చంపి జైలుకు వెళ్లాడు. జైలుశిక్ష అనుభవించి వ‌చ్చినా అతనిలో మార్పురాలేదు. ఈ నేప‌థ్యంలో మంగ‌ళవారం పూటుగా మ‌ద్యం తాగి వ‌చ్చిన ఓమ్‌పాల్‌ను భార్య పవిత్రా దేవీ మంద‌లించింది. ఇది ఇద్ద‌రి మ‌ధ్య వాగ్వాదానికి దారి తీసింది. 

దీంతో వారి కుమారుడు క‌ల్పించుకుని తండ్రితో వాద‌న‌కు దిగాడు. కొడుకు జోక్యంతో మ‌రింత రెచ్చిపోయిన ఓమ్‌పాల్ అత‌నిపై దాడి చేశాడు. అంత‌టితో ఆగ‌క త‌న ద‌గ్గ‌రున్న లైసెన్స్‌డ్ తుపాకీతో క‌న్న కొడుకు అని కూడా చూడ‌కుండా కాల్చి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఓమ్‌పాల్‌ను అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo