గురువారం 09 జూలై 2020
National - Jun 26, 2020 , 19:47:38

మేక‌ను కుక్క క‌రిచింద‌ని 40 కుక్క‌ల‌ను చంపేశాడు!

మేక‌ను కుక్క క‌రిచింద‌ని 40 కుక్క‌ల‌ను చంపేశాడు!

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలో ఓ వ్య‌క్తి దారుణానికి పాల్ప‌డ్డాడు. ఓ వీధి కుక్క త‌న మేక‌ను క‌రిచిందన్న కోపంతో కుక్క‌లన్నింటిపైనా అత‌ను కక్ష క‌ట్టాడు. ఊర్లో ఉన్న అన్ని కుక్క‌ల‌కు విషం ఇచ్చి చంపేశాడు. ఒడిశా రాష్ట్రం క‌ట‌క్ జిల్లాలోని మ‌హంగ టౌన్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. మ‌హంగ‌కు చెందిన‌ బ్ర‌హ్మానంద మాలిక్ అనే వ్య‌క్తి  ఒక మేక‌ను పెంచుకుంటున్నాడు. అయితే ఆ మేక‌ను ఇటీవ‌ల ఒక వీధి కుక్క క‌రిచింది. కుక్కు దాడిలో మేక తీవ్రంగా గాయ‌ప‌డ‌టంతో మాలిక్ కుక్క జాతిపైనే క‌క్ష‌గ‌ట్టాడు. 

ఊరిలోని కుక్క‌ల‌న్నింటిని చంపేయాల‌ని నిర్ణ‌యించుకుని అందుకు భ‌ర‌త్ మాలిక్ అనే మ‌రో వ్య‌క్తి సాయం తీసుకున్నాడు. ఇద్ద‌రు క‌లిసి మాంసంలో విషం క‌లిపి ఊర్లోని కుక్క‌ల‌న్నింటికి పెట్టారు. ఆ మాంసం తిని ఊర్లోని 40 కుక్క‌లు మృతిచెందాయి. ఈ ఘ‌ట‌న‌పై మ‌హంగ‌ స‌ర్పంచ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వారు కేసు స‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ప‌రారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేప‌ట్టారు. 


logo