శుక్రవారం 05 జూన్ 2020
National - May 10, 2020 , 08:42:59

కరోనాతో వెంటిలేట‌ర్‌పై 38రోజులు..డిశ్చార్జి

కరోనాతో వెంటిలేట‌ర్‌పై 38రోజులు..డిశ్చార్జి

ప‌శ్చిమబెంగాల్‌: ప‌శ్చిమ‌బెంగాల్ లో క‌రోనా పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన వ్య‌క్తి కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌య్యాడు. 52 ఏండ్ల స‌ద‌రు వ్య‌క్తి కోల్‌క‌తాలోని ఢాకురియా ఏఎంఆర్ఐ ఆస్ప‌త్రిలో 38 రోజులు వెంటిలేట‌ర్ పై ఉండి డిశ్చార్జవ‌డం విశేషం.

ఆస్ప‌త్రి సీఈవో మాట్లాడుతూ..సద‌రు వ్య‌క్తి మార్చి 29న ఆస్ప‌త్రిలో చేరాడు. దాదాపు 38 రోజులు వెంటిలేట‌ర్‌పైనే ఉన్నాడు. ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా ఉన్న అతను విజ‌యవంతంగా కోలుకుని డిశ్చార్జ‌వ‌డం అద్భుత‌మైన విష‌య‌మ‌న్నారు. వీల్ చైర్ పై ఉన్న ఆ వ్య‌క్తికి వైద్య సిబ్బంది చ‌ప్ప‌ట్ల‌తో వీడ్కోలు ప‌లికారు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo