ఆదివారం 28 ఫిబ్రవరి 2021
National - Jan 23, 2021 , 12:25:54

సింఘూ బోర్డ‌ర్ వ‌ద్ద అనుమానితుడు అరెస్ట్

సింఘూ బోర్డ‌ర్ వ‌ద్ద అనుమానితుడు అరెస్ట్

న్యూఢిల్లీ:  కొత్త సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీ-హ‌ర్యానా స‌రిహ‌ద్దుల్లోని సింఘూ వద్ద రైతులు ఆందోళ‌న చేప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే జ‌న‌వ‌రి 26వ తేదీన జ‌ర‌గ‌నున్న ట్రాక్ట‌ర్ ర్యాలీలో విధ్వంసం సృష్టించాల‌ని ప్లాన్ వేసిన ఓ వ్య‌క్తిని అరెస్టు చేశారు.  ర్యాలీ స‌మ‌యంలో న‌లుగురు రైతు సంఘాల నేత‌ల‌ను హ‌త్య చేయాల‌ని కూడా ప‌న్నాగం వేసిన‌ట్లు తెలుస్తోంది. పోలీసు అధికారి వ‌ద్ద తాను ట్రైనింగ్ తీసుకున్న‌ట్లు అరెస్టు అయిన వ్య‌క్తి తెలిపాడు. శుక్ర‌వారం రాత్రి ఆ వ్య‌క్తిని అరెస్టు చేశారు.   జ‌న‌వ‌రి 26వ తేదీన రైతులు ట్రాక్ట‌ర్ ర్యాలీ తీస్తున్న స‌మ‌యంలో.. పోలీసులు అడ్డుకున్న‌ప్పుడు ఫైరింగ్ చేయాలంటూ త‌న‌కు ఆదేశాలు ఉన్న‌ట్లు అరెస్టు అయిన వ్య‌క్తి చెప్పాడు.

ముందుగా ర్యాలీ తీస్తున్న రైతుల‌ను ఆపాల‌ని, వాళ్ల ఆగ‌కుంటే ఫైరింగ్ చేసేందుకు రెఢీ అయిన‌ట్లు ఆ వ్య‌క్తి తెలిపాడు. వేదిక‌పై ఉన్న న‌లుగుర్ని షూట్ చేయాల‌ని, ప్ర‌దీప్ సింగ్ అనే స్టేష‌న్ ఆఫీస‌ర్ త‌మ‌కు శిక్ష‌ణ ఇచ్చాడ‌ని, అయితే త‌మ‌ను క‌లిసే స‌మ‌యంలో అత‌ను మాస్క్ ధ‌రించి ఉంటాడ‌ని అరెస్టు అయిన వ్య‌క్తి చెప్పాడు. రైతు సంఘాల నేత‌ల‌ను హ‌త్య చేసేందుకు ప్లాన్ వేసిన వారిలో మ‌రో 9 మంది ఉన్న‌ట్లు అరెస్టు అయిన వ్య‌క్తి తెలిపాడు. దాంట్లో ఇద్ద‌రు మ‌హిళ‌లు ఉన్న‌ట్లు చెప్పాడు.  సోనిప‌ట్ పోలీసులు ఆ అనుమానిత వ్య‌క్తిని విచారిస్తున్నారు. 

VIDEOS

logo