ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 13:46:56

వర్షాలకు ఒంటరైన పిల్లి పిల్లను కాపాడిన ముంబై వాసి

వర్షాలకు ఒంటరైన పిల్లి పిల్లను కాపాడిన ముంబై వాసి

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇక మూగజీవుల సంగతి చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో వాడాలా ప్రాంతంలో ఒంటరై అరుస్తున్న పిల్లి పిల్లను ఓ వ్యక్తి గమనించాడు. వర్షపు నీటిలో ఉన్న దానిని రక్షించాడు. బైక్‌పై కూర్చోబెట్టి తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ పిల్లి పిల్లను పెంచుతానని అతడు పేర్కొన్నాడు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. 


logo