మంగళవారం 26 జనవరి 2021
National - Jan 08, 2021 , 09:36:40

మెడిక‌ల్ కాలేజీలో దూరిన న‌ల్ల చిరుత‌.. వీడియో

మెడిక‌ల్ కాలేజీలో దూరిన న‌ల్ల చిరుత‌.. వీడియో

బెంగ‌ళూరు: కర్ణాట‌క‌లోని చామ‌రాజన‌గ‌ర్ జిల్లాలో ఓ న‌ల్ల చిరుత‌పులి (బ్లాక్ పాంథ‌ర్‌) క‌ల‌క‌లం సృష్టించింది. ఎటునుంచి వ‌చ్చిందోగానీ జిల్లాలోని చామ‌రాజ‌న‌గర్ మెడిక‌ల్ కాలేజీలో (చామ‌రాజ‌న‌గ‌ర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్‌-CIMSలో) దూరింది. నేరుగా వైద్యుల క్వార్ట‌ర్స్‌లోకి వెళ్లి త‌నిఖీకి వ‌చ్చిన అధికారిలా కారిడార్‌లో క‌లియ‌తిరిగింది. చివ‌రికి ఫ్లోర్‌లోని ఓ గ‌దిలోకి తొంగిచూసి బ‌య‌టికి ప‌రుగుతీసింది. ఈ దృశ్యాలు కారిడార్‌లోని సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి. 

ఈ వీడియోను IFS అధికారి ప్ర‌వీణ్ క‌స్వాన్ ట్విట్ట‌ర్లో షేర్ చేశారు. బ్లాక్ పాంథ‌ర్ మెడిక‌ల్ కాలేజీ ఇన్‌స్పెక్ష‌న్‌కు వ‌చ్చిందంటూ దానికి క్యాప్ష‌న్ ఇచ్చారు. చిరుత ప్ర‌వేశించిన స‌మ‌యంలో క్వార్ట‌ర్స్ మూసి ఉండ‌టంతో ఎవ‌రికీ ఎలాంటి అపాయం జ‌రుగ‌లేదు. కాగా, చిరుత సంచారానికి సంబంధించిన దృశ్యాల‌ను కింది వీడియోలో మీరు కూడా వీక్షించ‌వ‌చ్చు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo