మంగళవారం 01 డిసెంబర్ 2020
National - Oct 21, 2020 , 14:57:44

దారిత‌ప్పి బ‌ర్రెల‌ కొట్టంలో దూరిన చిరుత కూన.. వీడియో

దారిత‌ప్పి బ‌ర్రెల‌ కొట్టంలో దూరిన చిరుత కూన.. వీడియో

ముంబై: మ‌హారాష్ట్ర‌లో ఓ చిరుత కూన దారిత‌ప్పి అడ‌వి నుంచి బ‌య‌టికి వ‌చ్చింది. అటూఇటూ తిరిగి ఆఖ‌రికి బ‌ర్రెల‌ కొట్టంలో దూరింది. అక్క‌డ కుడితి గోళానికి ఒక ప‌క్క‌న బర్రెలు క‌ట్టేసి ఉండ‌గా.. చిరుత‌కూన వెళ్లి ఆ కుడితి గోళెంలో ప‌డుకుంది. దీంతో చిరుత‌ను చూసి బ‌ర్రెలు, బ‌ర్రెల‌ను చూసి చిరుత భ‌య‌ప‌డిపోయాయి. చివ‌రికి స్థానికులు ఆ చిరుత కూన‌ను అట‌వీ ప్రాంతం వైపు గెద‌మ‌డంతో అడ‌విలోకి వెళ్లిపోయింది. ముంబైలోని ఆరే ప్రాంతంలోగ‌ల మిల్క్ కాల‌నీలో మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. చిరుత బ‌ర్రెల కొట్టంలో దూరిన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో చూడ‌వ‌చ్చు. ‌


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.