ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 20:26:50

పోలీస్ స్టేష‌న్‌కు పులి రాక‌తో.. ప‌శువుల‌న్నీ ప‌రార్‌!

పోలీస్ స్టేష‌న్‌కు పులి రాక‌తో.. ప‌శువుల‌న్నీ ప‌రార్‌!

అదేంటి పోలీస్ స్టేష‌న్‌కి, ప‌శువుల‌కు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియో చూస్తే గాని అర్థం కాదు. ఐఎఫ్ఎస్ అధికారి వైభ‌వ్ సింగ్ ట్విట‌ర్‌లో షేర్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ సంఘ‌ట‌న దేవ‌ప్ర‌యాగ్‌లో చోటుచేసుకున్న‌ది. ద‌ట్ట‌మైన అడ‌విలో వ‌న్య‌ప్రాణాల జాడ ఎక్కువ‌గా ఉంటుంది. అక్క‌డ తిరిగే ఓ పులి దారిత‌ప్పి రోడ్డు మీద‌కు వ‌చ్చేసింది. అది కూడా అడ‌వికి ద‌గ్గ‌ర్లో ఉండే పోలీస్‌స్టేష‌న్‌కు ఎదురుగా వచ్చి నిల్చుంది. రోడ్డు మీదుగా వెళ్తున్న ఆవుల‌ను త‌రిమికొట్టింది.

23 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో చిరుత కాసేపు పోలీస్ స్టేష‌న్‌కు ప‌హారా కాసింది. స్టేష‌న్‌ను నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఓ వ్య‌క్తి దాన్ని గ‌జ‌గ‌జవ‌ణికిపోయాడు. దెబ్బ‌తో లోప‌లికి వెళ్లి త‌లుపులు వేసుకున్నాడు. ఈ సంఘ‌ట‌న అంతా అక్క‌డున్న సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో చూసిన వాళ్లంద‌రూ  ‘‘దేవప్రయాగో వీధుల్లో పహారా కాస్తున్న కొత్త పోలీస్’’ అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. logo