గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 09:36:03

కిలో ఆవు పేడ రూ.2

కిలో ఆవు పేడ రూ.2

రాయ్‌పుర్‌ : రైతులు, గోశాలల నుంచి ఆవు పేడను కిలో 2 రూపాయల చొప్పున కొనుగోలు చేసే కార్యక్రమానికి ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్‌ భగేల్‌ ‘గోధన్‌ న్యాయ్‌ యోజన్‌’ పథకాన్ని ప్రారంభించారు. సేకరించిన ఆవు పేడను సహకార సంఘాల ద్వారా వర్మీకంపోస్టును తయారు చేసి అన్నధాతలకు అందిచనున్నారు.

దీని ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులు కూడా లాభాలు అర్జిస్తారని సర్కారు భావిస్తోంది. రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు మొదaవడానికి ముందు నిర్వహించే ‘హరేలీ’ ఉత్సవంలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం రైతులు, పశువుల పెంపకం దారుల ఆర్ధిక వృద్ధికి దోహదపడుతుందన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo