గురువారం 04 జూన్ 2020
National - May 09, 2020 , 17:51:14

క‌రోనా పేరుతో హోట‌ల్‌.. మూడేండ్ల క్రిత‌మే!

క‌రోనా పేరుతో హోట‌ల్‌.. మూడేండ్ల క్రిత‌మే!

మీరు విన్న‌ది నిజ‌మే. 2015 నుంచే గుజ‌రాత్‌లో క‌రోనా ఉంది. కాక‌పోతే అది వైర‌స్ కాదు. హోట‌ల్‌. ఇది గుజరాత్‌లోని బనస్కాంత సరిహద్దులో ఉంది. దీనిని 2015 లో ప్రారంభించారు. హోట‌ల్‌కు ఏం పేరు పెట్టాల‌ని ఆలోచిస్తున్న త‌రుణంలో యజ‌మాని బ‌ర్క‌త్ భాయ్‌కు క‌రోనా అనే  పేరు త‌ట్టింది. ఉర్థూలో గెలాక్సీ అనే అర్థం వ‌స్తుంద‌ట‌. అందుకే ఈ పేరు పెట్టాన‌ని చెబుతున్నాడు సిద్ద‌పూర్‌కు చెందిన భాయ్‌. క‌రోనా ప్ర‌భావం త‌ర్వాత ఈ హోట‌ల్‌ను చూసిన వారంతా షాక‌వుతున్నారు.  

క‌ర‌నో వైర‌స్ ప్ర‌జ‌ల‌లో భ‌యాన్ని రేకెత్తిస్తున్న‌ది. లాక్‌డౌన్ కార‌ణంగా క‌రోనా హోట‌ల్ కూడా మూత‌ప‌డింది.  జోధ్పూర్-పాలి హైవేలో ప్ర‌యాణించే ప్ర‌జ‌లు క‌రోనా హోట‌ల్‌ను చూసి ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. పైగా క‌రోనా హోట‌ల్‌తో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈ దెబ్బ‌తో వారంతా హోట‌ల్‌ను యుగాలుగా గుర్తుంచుకుంటార‌ని భాయ్ చెబుతున్నారు.logo