శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 01:44:26

కరోనా దవాఖానలో పందుల గుంపు!

కరోనా దవాఖానలో పందుల గుంపు!

బెంగళూరు: కర్ణాటకలోని కలబురగి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రంగ ‘కొవిడ్‌-19’ దవాఖానలో నల్ల పందుల గుంపు స్వేచ్ఛగా నడుచుకుంటూ వెళుతున్న వీడియో ఒకటి వెలుగుచూసింది. ఈ సంగతి తెలియగానే వాటి యజమానిపై కేసు నమోదు చేయాలని పోలీసులను గుల్బర్గా డిప్యూటీ కమిషనర్‌ ఆదేశించారు. దీనిపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రియాంక్‌ ఖర్గే మాట్లాడుతూ రాష్ట్ర డిప్యూటీ సీఎం గోవింద్‌ ఎం కర్జోల్‌ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి బీ శ్రీరాములు మాట్లాడుతూ ‘ఇది మూడు రోజుల క్రితం వీడియో. తక్షణం చర్య తీసుకోవాలని ఆదేశించాను’ అని చెప్పారు. 


logo