శనివారం 04 ఏప్రిల్ 2020
National - Feb 19, 2020 , 23:10:48

గుండు గీయించుకొని నిరసన తెలిపిన గెస్ట్‌ లెక్చరర్‌..

గుండు గీయించుకొని నిరసన తెలిపిన గెస్ట్‌ లెక్చరర్‌..

మధ్యప్రదేశ్‌: తమ ఉద్యోగాలు ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయడంలేదని ఆగ్రహించిన ఓ మహిళా గెస్ట్‌ లెక్చరర్‌ గుండు గీయించుకొని తన నిరసన తెలిపారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని భోపాల్‌లో వందలాది మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు.. తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్‌ చేయాలని నిరసనలు తెలుపున్నారు. ఈ సందర్భంగా సదరు ఉద్యోగిని మాట్లాడుతూ.. గత 72 రోజులుగా ఇక్కడ తమ నిరసనలు, భాదలు తెలుపుతున్నా.. ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగాలు రెగ్యులరైజ్‌ చేయాలని ఆందోళనలు ఇలాగే తెలియజేస్తామనీ, అయనప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే.. ఇదే ప్రాంతంలో అందరు మహిళా కాంట్రాక్టు ఉద్యోగులంతా శిరోముండనం చేయించుకొని, నిరసనలు తెలుపుతామని ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


logo