బుధవారం 20 జనవరి 2021
National - Dec 02, 2020 , 18:22:45

యూపీలో విషాదం.. బోరుబావిలోప‌డ్డ నాలుగేండ్ల బాలుడు

యూపీలో విషాదం.. బోరుబావిలోప‌డ్డ నాలుగేండ్ల బాలుడు

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం మ‌హోబా జిల్లా కుల్‌ప‌హ‌ర్ ఏరియాలో విషాద‌క‌ర ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ది. ఓ నాలుగేండ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరుబావిలో ప‌డిపోయాడు. గ్రామ‌స్తులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ బాలుడిని కాపాడేందుకు స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టాయి. బాలుడు బోరుబావిలో ప‌డిపోయిన‌ట్లు త‌మ‌కు ఈ ఉద‌యం స‌మాచారం అందింద‌ని, దాంతో వెంట‌నే రంగంలోకి దిగి రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టామ‌ని అధికారులు చెప్పారు. బాలుడు శ్వాస తీసుకోవ‌డానికి వీలుగా బోరుబావిలోకి ఆక్సిజ‌న్ స‌ర‌ఫారా చేస్తున్నామ‌ని, బోరుబావికి స‌మాంత‌రంగా మ‌రో గొయ్యి తీసి బాలుడిని వెలికితీసే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo