బుధవారం 03 మార్చి 2021
National - Jan 22, 2021 , 15:50:34

సీరమ్‌ ప్లాంట్‌ను సందర్శించిన ఫోరెన్సిక్ బృందం

సీరమ్‌ ప్లాంట్‌ను సందర్శించిన ఫోరెన్సిక్ బృందం

ముంబై: అగ్నిప్రమాదానికి గురైన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) ప్లాంట్‌ను ఫోరెన్సిక్‌ బృందం శుక్రవారం సందర్శించింది. మహారాష్ట్ర పూణేలోని మంజరి ప్లాంట్‌లో గురువారం జరిగిన అగ్ని ప్రమాదంపై ఆరా తీసింది. మంటల వ్యాప్తికి కారణం ఏమిటన్నదానిపై దర్యాప్తు కోసం కొన్ని నమూనాలను సేకరించింది. సీరమ్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కొత్తగా నిర్మిస్తున్న భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు నిర్మాణ కార్మికులు మరణించగా పలువురు గాయపడ్డారు.

మరోవైపు మహారాష్ట్ర మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ శుక్రవారం పూణేలోని సీరమ్‌ ప్లాంట్‌ను అధికారులతో కలిసి సందర్శించారు. ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సైరస్ పూనావాలాను కలిసి అగ్నిప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. 


కాగా, నిర్మాణంలో ఉన్న ప్లాంట్‌ భవనంలో గురువారం జరిగిన అగ్నిప్రమాదం వల్ల తాము ఆర్థిక నష్టాలను చవిచూసినట్లు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) అధికారులు తెలిపారు. భవిష్యత్తులో బీసీజీ, రోటా వ్యాక్సిన్ల ఉత్పత్తిపై ఇది బాగా ప్రభావం చూపుతుందని వెల్లడించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo