మంగళవారం 26 జనవరి 2021
National - Nov 29, 2020 , 14:30:08

లిఫ్టులో ఇరుక్కుని ఐదేండ్ల బాలుడు మృతి

లిఫ్టులో ఇరుక్కుని ఐదేండ్ల బాలుడు మృతి

ముంబై: మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని ధారవి ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితుల‌తో ఆడుకుంటున్న‌ ఐదేండ్ల బాలుడు లిఫ్టులో ఇరుక్కుని మృతిచెందాడు. వివ‌రాల్లోకి వెళ్తే..  షాహుర్‌ నగర్‌లోని కోజీ షెల్టర్‌ అనే అపార్ట్‌మెంట్‌లో ఉండే మహ్మద్‌ హోజైఫ్‌ షేక్‌ అనే ఐదేండ్ల‌ బాలుడు స్నేహితులతో కలిసి ఆడుకుంటూ.. కింది ఫ్లోర్‌కు వెళ్లడం కోసం ఫోర్త్ ఫ్లోర్‌లో లిఫ్ట్‌ ఎక్కాడు. అయితే లిఫ్ట్‌ కింది ఫ్లోర్‌ రాగానే డోరు తెరుచుకుంది. 

దాంతో మ‌హ్మ‌ద్ హూజైఫ్ షేక్‌ త‌ప్ప అత‌ని స్నేహితులు అంద‌రూ లిఫ్టు నుంచి బయటికి వెళ్లిపోయారు. చివ‌ర‌గా లిఫ్టు నుంచి బ‌య‌టికి వ‌చ్చిన షేక్‌.. గ్రిల్స్‌ వేస్తుండగా వెనుక ఉన్న డోర్‌ మూసుకుపోయింది. దాంతో షేక్ డోర్‌కు, గ్రిల్స్‌కు మధ్య ఉండిపోయాడు. ఇంత‌లో మ‌రొక‌రు లిఫ్ట్ బ‌ట‌న్ నొక్క‌డంతో లిఫ్ట్‌ క‌దిలింది. దాంతో బాలుడు గ్రిల్స్ మ‌ధ్య న‌లిగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ  ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. 


logo