మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 16:57:08

ఈయనకు సర్వం ఫొటోగ్రఫీనే..

ఈయనకు సర్వం ఫొటోగ్రఫీనే..

బెంగళూరు : ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు రవి హొంగాల్. కర్ణాటకలోని బెలగావిలో నివసిస్తున్నాడు. ఈయన భార్య పేరు రాణి. ఫొటోగ్రఫీ అంటే చచ్చేంత ప్రాణం. చిన్ననాటి నుంచి ఫొటోగ్రఫీలో మెళకువలు నేర్చుకుంటూ ప్రస్తుతం అదే వ్యాపారంలో స్థిరపడ్డాడు. 

ఈయనకు ముగ్గురు కుమారులు. ఫొటోగ్రఫీపై ప్రేమతో తనకు అన్నం పెడుతున్న కెమెరా కంపెనీల పేర్లు.. ఎప్సాన్, కెనాన్, నికాన్ అని పేర్లు పెట్టుకున్నాడు. తానుంటున్న ఇంటిని కెమెరా మాదిరిగా కళాత్మకంగా నిర్మించుకుని ఫొటోగ్రఫీపై తన మక్కువను ప్రదర్శిస్తున్నారు. కెమెరా లెన్స్ ను కిటికీ మాదిరిగా తయారుచేసి.. ఇంటిపైనుంచి కింది వరకు ఫిల్మ్ ను జారవిడిచారు. దారి వెంట వెళ్లే వారు ఈ ఇంటిని చూడగానే.. వావ్ ఎంత గమ్మత్తుగా ఉంది.. అని అనకుండా మానరు. పెంటాక్స్ కెమెరాతో మా ఇంటి పరిసరాల్లో ఫొటోలు తీస్తూ అందరూ అభినందిస్తుంటే ఆనందించేవాడినని, అలాఅలా మెల్లగా ఫొటోగ్రఫీని హాబీగా మార్చుకున్నానని చెప్తున్నారు రవి హొంగాల్. 

ఎంతో అభిమానంతో నిర్మించుకున్న రవి ఇంటిని మీరు కూడా చూసి అభినందించండి.logo