శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 31, 2020 , 14:54:27

పులిని ఆటాడించిన బుడుబుంగ.. వీడియో

పులిని ఆటాడించిన బుడుబుంగ.. వీడియో

ఆకలిగా ఉన్న పులికి చెరువులో బుడుబుంగ(నీటిబాతు) కనిపించింది. దాన్ని తినేద్దామని ఆశగా చెరువులోకి దూకి బాతును అందుకుందామని ప్రయత్నించగా అది బుడుక్కున నీటిలో మునిగి అంత దూరంలో తేలింది. నోట్లో పడిందనుకున్న నీటిబాతు తప్పించుకోవడంతో పులి నిరాశకు గురైంది. ప్రస్తుతం ఈ విడియో నెట్టింట్లో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోను యూపీ అడిషనల్‌ ఎస్పీ రాహుల్‌ శ్రీవాత్సవ్‌ ట్విట్టర్‌లో పోస్టు చేయగా బాతు సమయస్ఫూర్తిని నెటిజన్లు కామెంట్ల రూపంలో మెచ్చుకుంటున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo