బుధవారం 01 ఏప్రిల్ 2020
National - Mar 02, 2020 , 18:04:45

నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా

నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా

న్యూఢిల్లీ : నిర్భయ దోషులకు మరోసారి ఉరి వాయిదా పడింది. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు మరోసారి స్టే విధించింది. గతంలో ఇచ్చిన డెత్‌ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ నిందితుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా సోమవారం ఉదయం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. క్షమాభిక్ష పిటిషన్‌ పెండింగ్‌లో ఉన్నందున స్టే ఇవ్వాలని పిటిషన్‌లో గుప్తా కోరాడు. దీంతో విచారణ అనంతరం ఉరిశిక్ష అమలుపై స్టే విధించింది. స్టే ఇవ్వడం ఇది మూడోసారి. జనవరి 22, ఫిబ్రవరి 1న ఉరి తీయాలంటూ ఇచ్చిన డెత్‌ వారెంట్లపై కోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. మార్చి 3న ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని గతంలో కోర్టు డెత్‌ వారెంట్లు ఇచ్చింది. కానీ గుప్తా పిటిషన్‌తో అది కూడా ఆగిపోయింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డెత్‌ వారెంట్లపై స్టే విధించింది పటియాలా హౌస్‌ కోర్టు.


logo
>>>>>>