శుక్రవారం 30 అక్టోబర్ 2020
National - Sep 21, 2020 , 17:50:04

రాష్ట్రపతిని కలిసిన శిరోమణి అకాలీదళ్ ప్రతినిధి బృందం

రాష్ట్రపతిని కలిసిన శిరోమణి అకాలీదళ్ ప్రతినిధి బృందం

న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్రానికి చెందిన శిరోమణి అకాలీదళ్ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని రామ్‌నాథ్ కోవింద్‌ను సోమవారం కలిసింది. రాజ్యసభలో బలవంతంగా ఆమోదించిన 'రైతు వ్యతిరేక' బిల్లులపై సంతకం చేయవద్దని ఆయనను అభ్యర్థించింది. అగ్రి బిల్లులను పార్లమెంటుకు తిరిగి పంపాలని రాష్ట్రపతిని కోరినట్లు శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ తెలిపారు. ఈ బిల్లుల వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందన్నది ఆయనకు వివరించామన్నారు. పార్లమెంట్ ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామ్యమైన శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మరోవైపు కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఎన్డీయే నుంచి వైదొలగాలని శిరోమణి అకాలీదళ్ యోచిస్తున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన ప్రతినిధి బృందం రాష్ట్రపతిని రామ్‌నాథ్ కోవింద్‌ను సోమవారం కలువడం ప్రాధాన్యత సంతరించుకున్నది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.