హైదరాబాద్ : చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. విధుల్లో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్‌పై ఇద్దరు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఓ కేసులో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను కానిస్టేబుల్ కిరణ్.. చిలకలగూడ పీఎస్‌కు తీసుకువస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు కానిస్టేబుల్‌పై ఆకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడిలో కిరణ్ తలకు తీవ్ర గాయమైంది. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.