ఆదివారం 12 జూలై 2020
National - Jun 17, 2020 , 14:22:26

పెండ్లి ఊరేగింపులోనూ వివక్ష.. దళిత వరుడ్ని గుర్రం ఎక్కనీయని వైనం

పెండ్లి ఊరేగింపులోనూ వివక్ష.. దళిత వరుడ్ని గుర్రం ఎక్కనీయని వైనం

భోఫాల్‌: దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ పెండ్లి ఊరేగింపును అగ్రవర్ణానికి చెందినవారు అడ్డుకున్నారు. గుర్రంపైనున్న వరుడ్ని కొందరు కిందకు లాగేయడంతో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఛతర్‌పూర్‌లోని సతై ప్రాంతంలో సోమవారం ఈ ఘటన జరిగింది. దళితుడైన ఓ పెండ్లి కుమారుడు గుర్రంపై ఊరేగడాన్ని స్థానికులైన యాదవ సామాజిక వర్గానికి  చెందినవారు సహించలేకపోయారని సతై పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో దీపక్‌ యాదవ్‌ తెలిపారు.  ఆ వరుడి పట్ల వివక్ష చూపినవారిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 
logo