గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 14:15:14

పేలుడు పదార్థం తినబోయి గాయాలతో చనిపోయిన ఆవు

పేలుడు పదార్థం తినబోయి గాయాలతో చనిపోయిన ఆవు

బెంగళూరు: ఒక ఆవు పొరపాటున పేలుడు పదార్థం తినబోగా అది పేలింది. దీంతో తీవ్రంగా గాయపడి చనిపోయింది. కర్ణాటకలోని మైసూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. హెచ్‌డీ కోటి ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రం వద్ద అడవి పందులను చంపేందుకు కొందరు నాటు బాంబులు పెట్టారు. కాగా, ఒక ఆవు వాటిని తినే పదార్థంగా భావించింది. వాటిని తినబోగా అవి పేలాయి. దీంతో ఆవు నోటికి తీవ్ర గాయమైంది.

ఈ విషయం తెలిసిన పశువైద్యులు దానికి చికిత్స అందించి కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే తీవ్రంగా గాయపడిన ఆ ఆవు బాధను తట్టుకోలేక చనిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇటీవల మూగజీవాలు పేలుడు పదార్థాలను ఆహారంగా భావించి వాటిని తినబోయి ప్రమాదాలకు గురవుతున్నాయి. కొందరు మనుషుల నిర్లక్ష్యం వల్ల అవి మృత్యువాత పడుతున్నాయి.logo