సోమవారం 25 మే 2020
National - Apr 07, 2020 , 18:43:45

ఒక పాజిటివ్ వ్య‌క్తితో 30 రోజుల్లో 406 మందికి వైర‌స్ సోకుతుంది

ఒక పాజిటివ్ వ్య‌క్తితో 30 రోజుల్లో 406 మందికి వైర‌స్ సోకుతుంది

హైద‌రాబాద్‌: కోవిడ్‌19 పేషెంట్ ఒక‌వేళ లాక్‌డౌన్ ఆదేశాలు పాటించ‌కుంటే లేదా ఆ పేషెంట్ సామాజిక దూరాన్ని పాటించకున్నా.. వారి నుంచి క‌రోనా వైర‌స్ కేవ‌లం 30 రోజుల్లో 406 మందికి సోకే ప్ర‌మాదం ఉంద‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఈ విష‌యాన్ని ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆరోగ్య‌శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు. ఐసీఎంఆర్ నిర్వ‌హించిన స్ట‌డీలో ఇది నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆయ‌న తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు భార‌త్‌లో వైర‌స్ వ‌ల్ల 117 మంది చ‌నిపోయిన‌ట్లు ఆయ‌న చెప్పారు.  4421 కేసులు పాజిటివ్‌గా తేలాయ‌న్నారు. 

భార‌తీయ రైల్వే దాదాపు 2500 కోచ్‌ల్లో.. సుమారు 40 వేల ఐసోలేష‌న్ బెడ్‌ల‌ను త‌యారీ చేసిన‌ట్లు ల‌వ్ అగ‌ర్వాల్‌ చెప్పారు. ప్ర‌తి రోజూ రైల్వేశాఖ 375 ఐసోలేష‌న్ బెడ్ల‌ను త‌యారీ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. మొత్తం 133 లొకేష‌న్ల‌లో ఈ ప‌ని జ‌రుగుతుంద‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ల‌క్షా ఏడు వేల ఆరు మందికి క‌రోనా ప‌రీక్ష‌లు జ‌రిపిన‌ట్లు ఐసీఎంఆర్ ఎపిడ‌మాల‌జీ అధిప‌తి గంగాఖేద్క‌ర్‌  తెలిపారు.  136 ప్ర‌భుత్వ ల్యాబ్‌లు ప‌రీక్ష‌లు చేప‌డుతున్నాయ‌ని, 59 ప్రైవేటు ల్యాబ్‌లు కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. 
logo