శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 17:23:38

నోయిడాలో దంప‌తుల అనుమానాస్ప‌ద‌ మృతి

నోయిడాలో దంప‌తుల అనుమానాస్ప‌ద‌ మృతి

 న్యూఢిల్లీ: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నోయిడాలోని ఓ ఇంట్లో ఈ ఉద‌యం చాల సేప‌టివ‌ర‌కు ప‌సిబిడ్డ ఏడుస్తూ ఉండ‌టాన్ని ఇరుగుపొరుగువారు గ‌మ‌నించారు. అనుమానంతో ఆ ఇంటి ద‌గ్గ‌రికి వెళ్లి త‌లుపులు నెట్టగా గ‌డియ పెట్టిఉంది. కిటికీలోంచి చూసేస‌రికి దంప‌తులిద్ద‌రూ మ‌ర‌ణించి ఉన్నారు. వారి ప‌క్క‌నే చిన్నారి ఏడుస్తూ కూర్చుని ఉంది. ఈ దృశ్యాన్ని చూసిన‌ స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించ‌గా వారు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని తలుపులు ప‌గుల‌గొట్టారు. 

మృత‌దేహాల‌ను పోస్ట్‌మార్టానికి త‌ర‌లించి, చిన్నారిని శిశు సంర‌క్ష‌ణ కేంద్రానికి అప్ప‌గించారు. అనంత‌రం మృతుల వివ‌రాల కోసం స్థానికుల‌ను విచారించారు. ఈ విచార‌ణ‌లో మృతులు ఇద్ద‌రూ బీహార్‌కు చెందిన దంప‌తులని, బీహార్‌లో కుటుంబ‌స‌భ్యుల‌తో గొడ‌వ‌ప‌డి ఇటీవ‌లే వారు నోయిడాకు వ‌చ్చార‌ని వెల్ల‌డైంది. దీంతో కుటుంబ‌క‌ల‌హాల కార‌ణంగా దంప‌తులు ఇద్ద‌రూ ఆత్మ‌హ‌త్యకు పాల్ప‌డి ఉంటార‌ని పోలీసులు భావిస్తున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. 

 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo