శనివారం 11 జూలై 2020
National - Jul 01, 2020 , 02:08:18

అందరికీ కరోనా టీకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే..

అందరికీ కరోనా టీకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే..

దేశవ్యాప్తంగా టీకాల కార్యక్రమం:  ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: త్వరలో కరోనా టీకా అందుబాటులోకి రాగానే దేశంలోని ప్రజలందరికీ ఇచ్చేలా సార్వత్రిక వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. వ్యాక్సిన్‌ దేశంలో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా తక్కవ ధరలోనే లభించాలని అధికారులకు సూచించారు. టీకా తయారీ ప్రయత్నాలు కీలక దశకు చేరుకున్న వేళ కీలక అధికారులతో ప్రధాని మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు మోదీ ట్వీట్‌ చేస్తూ.. ‘ఒక ముఖ్యమైన విషయం. దేశం నలుమూలలా వ్యాక్సినేషన్‌ కోసం ఒక టెక్‌ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటుచేసే అంశంపై చర్చలు జరిపాం’ అని వెల్లడించారు.

అధికారులతో ప్రధాని చర్చించిన ముఖ్యమైన అంశాలకు ఇవీ..

  • మెడికల్‌ సైప్లె చైన్‌ నిర్వహణ.
  • కరోనా బారినపడే ప్రమాదం ఎక్కువ ఉన్నవారిని గుర్తించటం. ముఖ్యంగా డాక్టర్లు, నర్సులు, ఆరోగ్యకార్యకర్తలు, కరోనాపై పోరాటంలో పాలుపంచుకుంటున్న వైద్యేతర సిబ్బందికి ముందుగా టీకాలు వేయాలి.
  • వ్యాక్సిన్‌ తయారీలో భాగస్వాములైన వివిధ సంస్థలను సమన్వయం చేయాలి.
  • దేశంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఎక్కడైనా, ఎవరికైనా వ్యాక్సిన్‌ వేసే పరిస్థితులు కల్పించాలి.
  • వ్యాక్సిన్‌ దేశంలోని ప్రతి ఒక్కరు కొనగలిగే అందుబాటు ధరలో ఉండాలి.
  • వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే దశ నుంచి ప్రజలకు టీకాలు వేసే వరకు ప్రతి దశనూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఒక సాంకేతిక వేదికను ఏర్పాటుచేయాలి.


logo