శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 16:54:59

అసోంలో బ‌ర్మా కొండ చిలువ!.. వీడియో

అసోంలో బ‌ర్మా కొండ చిలువ!.. వీడియో

గువాహ‌టి: ‌కొండ చిలువ! ఈ పాముకు కోర‌ల్లో విషం ఉండ‌దు! కానీ భారీ ఆకారంలో చూడ‌టానికి భ‌యంక‌రంగా ఉంటుంది! అందులోనూ బ‌ర్మా కొండ‌చిలువలు ప‌రిమాణంలో మ‌రింత పెద్ద‌గా ఉంటాయి! ఈ కొండ చిలువ‌లు 10 నుంచి 15 కేజీల బ‌రువున్న జీవుల‌పైకి అమాంతం దూకి చుట్టేస్తాయి. ఆ జీవుల‌కు ఊపిరాడ‌కుండా చేసి చ‌నిపోయిన త‌ర్వాత మింగుతాయి. అలాంటి ఓ భారీ కొండ చిలువ అసోం రాష్ట్రం న‌గావ్ జిల్లా బోర్ఘాట్ చ‌ప‌నాల ఏరియాలో క‌నిపించింది. దీంతో స్థానికులు పాములు ప‌ట్టేవాళ్ల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో వారు పామును బంధించి స్వాంగ్ రిజ‌ర్వ్ ఫారెస్టులో వ‌దిలేశారు. కొండ చిలువను బంధించిన దృశ్యాల‌ను ఈ వీడియోలో చూడ‌వ‌చ్చు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo