బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 23, 2020 , 10:10:32

క‌డ‌ప జిల్లాలో క్రికెట్ బంతి త‌గిలి బాలుడు మృతి

క‌డ‌ప జిల్లాలో క్రికెట్ బంతి త‌గిలి బాలుడు మృతి

క‌డ‌ప‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం క‌డ‌ప జిల్లాలో హృద‌య‌విదార‌క ఘ‌ట‌న చోటుచేసుకుంది. స్నేహితుల‌తో క‌లిసి ఆడుకోవాల‌న్న స‌ర‌దా ఓ బాలుడి ప్రాణం తీసింది. క్రికెట్ ఆడుతుంగా బంతి మ‌ర్మాంగాల‌పై త‌గలడంతో ఎన్వీ భ‌ర‌త్ కుమార్ రెడ్డి అనే బాలుడు స్పృహ త‌ప్పి ప‌డిపోయాడు. వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.  క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్‌లో ఆదివారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. 

పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ కు చెందిన భ‌ర‌త్ కుమార్ రెడ్డి అనే 13 ఏండ్ల బాలుడు ఆదివారం స్నేహితులతో క‌లిసి క్రికెట్ ఆడేందుకు వెళ్లాడు. ఆట‌లో భాగంగా స్నేహితుడు విసిరిన బంతి భ‌ర‌త్ మ‌ర్మాంగాల‌పై త‌గ‌ల‌డంతో అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలాడు. దీంతో కుటుంబ స‌భ్యులు బాలుడిని ఆత్మ‌కూరులోని ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసుకుని పోస్టుమార్టం కోసం ఆత్మ‌కూరులోని ప్ర‌భుత్వాస్ప‌త్రికి త‌ర‌లించారు.     


logo