శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 05, 2020 , 01:20:49

బ్లాక్‌ టైగర్‌!

బ్లాక్‌ టైగర్‌!

బ్లాక్‌ టైగర్‌.. ఈ పేరు సినిమాల్లో ఎక్కువగా వినడమే కానీ ఎప్పుడూ చూసి ఉండరు. ఇవి అత్యంత అరుదైనవి. ఇటీవల ఒడిశాలో ఓ బ్లాక్‌ టైగర్‌ కనిపించింది. సౌమెన్‌ బాజ్‌పేయీ అనే ఫొటోగ్రాఫర్‌ దీనిని తన కెమెరాలో బంధించారు. బ్లాక్‌ టైగర్లు అంతరించి పోతున్న దశలో ఉన్నాయి. ఇలాంటివి దేశంలో 7-8 మాత్రమే ఉన్నాయని పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పులుల్లో జన్యుమార్పుల వల్ల ఇలా నల్లటి రంగులో ఉన్న చారలు ఎక్కువగా ఏర్పడతాయని తెలిపారు.