సోమవారం 03 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 12:37:29

ఉరేసుకుని క‌రోనా బాధితురాలు ఆత్మ‌హ‌త్య‌

ఉరేసుకుని క‌రోనా బాధితురాలు ఆత్మ‌హ‌త్య‌

బెంగ‌ళూరు: దేశంలో ఇంకా క‌రోనా మ‌హ‌మ్మారి విల‌యం ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది. ప్ర‌తిరోజు వేళ‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇదిలావుంటే మ‌రోవైపు కొంత‌మంది క‌రోనా బాధితులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. తాము బతుకుతామో లేదోన‌న్న భ‌యంతో కొంద‌రు మాన‌సికంగా కుంగిపోతున్నారు. ఈ మాన‌సిక కుంగుబాటు క్ర‌మంగా ఆత్మ‌హ‌త్య‌ల‌కు దారితీస్తున్న‌ది. 

తాజాగా క‌ర్ణాట‌క‌లో అలాంటి ఘ‌టనే చోటుచేసుకుంది. క‌రోనా వైర‌స్ సోకింద‌న్న భ‌యంతో 60 ఏండ్ల వృద్ధురాలు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున మ‌ల్లేశ్వ‌రంలోని కేసీ జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. నార్త్ బెంగ‌ళూరు డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీస్ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.      

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo