శుక్రవారం 03 జూలై 2020
National - Apr 18, 2020 , 07:18:39

దృష్టి లోపం ఉన్న మహిళపై అత్యాచారం

దృష్టి లోపం ఉన్న మహిళపై అత్యాచారం

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో దారుణం జరిగింది. షాహ్‌పురా ఏరియాలో నివాసం ఉంటున్న ఓ మహిళపై శుక్రవారం అత్యాచారం జరిగింది. 53 ఏళ్ల మహిళకు దృష్టి లోపం ఉంది. ఆమె బ్యాంకు ఉద్యోగం చేస్తున్నారు. మహిళ భర్త, ఇతర కుటుంబ సభ్యులు కొద్ది రోజుల క్రితం రాజస్థాన్‌ వెళ్లారు. లాక్‌డౌన్‌ కారణంగా వారు అక్కడే ఉండిపోయారు. దీంతో షాహ్‌పురాలో ఆమె ఒక్కరే ఉంటున్నారు. అయితే శుక్రవారం ఆమెపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారం చేసి పారిపోయాడు. బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలి నివాసాన్ని పరిశీలించారు. ఆధారాలు సేకరించారు. అనంతరం బాధిత మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


logo