సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 13:34:57

క‌రోనా సోకిన యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

క‌రోనా సోకిన యువ‌కుడి ఆత్మ‌హ‌త్య‌

ప‌ట్నా: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల జీవితాల‌ను అత‌లాకుత‌లం చేస్తున్న‌ది. ఆరోగ్య‌ప‌రంగా, ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ కొడుతున్న‌ది. అంతేగాక ఈ మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎన్నో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ర‌క్త సంబంధీకులు చ‌నిపోయినా క‌డ‌సారి చూసుకోలేని దుస్థితి నెల‌కొన్నది. క‌నీసం బాధిత కుటుంబాన్ని ఓదార్చే ప‌రిస్థితులు కూడా క‌నిపించ‌డంలేదు. ఈ నేప‌థ్యంలో కొంద‌రు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిందంటే చాలు ఇక తాము బతుక‌మేమో అనే భ‌యంతో ముందే ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. 

తాజాగా బీహార్‌లో అలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది. బీహార్ రాజ‌ధాని ప‌ట్నా న‌గ‌రంలోని మ‌ల్స‌లామీ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధికి చెందిన ఓ 35 ఏండ్ల యువ‌కుడికి ఇటీవ‌ల క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో అప్ప‌టి నుంచి హోమ్ క్వారెంటైన్‌లో ఉంటున్నాడు. అయితే, క‌రోనా వ‌చ్చినందున ఇక తాను బతుక‌నేమోన‌నే భ‌యంతో తీవ్ర ఒత్తిడికి గురై శుక్ర‌వారం రాత్రి ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.       

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo