బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 11, 2020 , 17:46:23

ప‌దిహేను అడుగుల భారీ కింగ్ కోబ్రా!

ప‌దిహేను అడుగుల భారీ కింగ్ కోబ్రా!

చెన్నై: అక‌స్మాత్తుగా రెండు అడుగుల పాము పిల్ల‌ క‌నిపిస్తే ఒళ్లు ఝ‌ల్లుమంటుంది. ఆ పాము ఇంకా కొంచెం పెద్ద‌దైతే భ‌యంతో వ‌ణికిపోతాం. అది తాచుపాము అని తెలిస్తే అక్క‌డి నుంచి వాయు వేగంతో ప‌రుగు తీస్తాం. కానీ త‌మిళ‌నాడు రాష్ట్రం కోయంబ‌త్తూరు జిల్లాలోని తొండ‌ముత్తూర్ తాలూకా న‌రసిపురం గ్రామంలో ఏకంగా 15 అడుగుల కింగ్ కోబ్రా ద‌ర్శ‌న‌మిచ్చింది. ఆ పాము పొలం ద‌గ్గ‌రున్న ఒక గుడిసెలో దూరడంతో అది గ‌మనించిన రైతు అటవీ అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. 

స‌మాచారం అందుకున్న అట‌వీ సిబ్బంది ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని పామును ఓ సంచిలో బంధించారు. ఆ పాము ఏకంగా ప‌దిహేను అడుగుల పొడ‌వు ఉండ‌టాన్ని చూసి అట‌వీ సిబ్బంది సైతం ఆశ్చ‌ర్య‌పోయారు. అంత భారీ సైజు కింగ్ కోబ్రాలు చాలా అరుదుగా మాత్ర‌మే క‌నిపిస్తాయ‌ని చెప్పారు. అనంత‌రం ఆ పామును తీసుకెళ్లి సిరువాని అట‌వీ ప్రాంతంలో వ‌దిలేశారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo