శనివారం 04 జూలై 2020
National - Jun 25, 2020 , 21:50:00

అస్సాంలో వరదలు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్‌

అస్సాంలో వరదలు.. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్‌

అస్సాం : రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్నాయి. పలు ప్రాంతాలను వరదల ముంచెత్తడంతో ౩6వేల మంది నిరాశ్రయులు కాగా ఒకరు మృతి చెందారు. 4329హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు. 9సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి నిరాశ్రయులను తరలిస్తున్నారు. టిన్సుకియా ప్రాంతం పరిధిలోని జ్యోతినగర్‌ను వరద ముంచెత్తింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగి సుమారు 31మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఎన్డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ సత్య ప్రదాన్‌ తెలిపారు. ఆపరేషన్‌ కొనసాగుతోందని మరింత మందిని రక్షించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. టిన్సుకియా భాగ్‌జాన్‌ ప్రాంతాల్లో భారీ వర్షాలకు వంతెన కుప్పకూలింది. టిన్సుకియా దుందుం ప్రాంతంలో 24గంటలుగా భారీ వర్షం కురుస్తుండడంతో  జనజీవనం స్తంభించిపోయింది. logo