బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 11:30:03

మహమ్మారిని జయించిన నెల రోజుల చిన్నారి

మహమ్మారిని జయించిన నెల రోజుల చిన్నారి

బెంగళూరు : పుట్టిన వెంటనే మహమ్మారి బారినపడ్డ చిన్నారి కోలుకుంది. నెలలు నిండకుండానే పుట్టి.. కేవలం 980 గ్రాముల బరువుతో జన్మించి విజయవంతంగా కోలుకోవడంతో మంగళవారం చిన్నారిని వైద్యులు దవాఖాన నుంచి డిశ్చార్జి చేశారు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఓ మహిళ ఆగస్ట్‌ 13న ఓ ప్రైవేటు నర్సింగ్‌ హోంలో ప్రసవం అయ్యింది. ఆడ శిశుడు అత్యంత తక్కువ బరువు (ఆదర్శ ప్రసవ బరువు 2.8 కిలోల నుంచి 2.9 కిలోలు) కావడంతో వాణీ విలాస్‌ దవాఖానకు తరలించారు. పీడియాట్రిక్ ఐసోలేషన్ వార్డులో చేర్చిన ఐదు రోజుల తర్వాత కరోన పాజిటివ్‌గా పరీక్షించారు. దీంతో విక్టోరియా దవాఖానలోని ట్రామాకేర్‌ సెంటర్‌కు తరలించారు.

పుట్టినప్పటి నుంచి అనేక సమస్యలతో బాధపడుతుండగానే లక్షణాలు కనిపించలేదు. చిన్నారి కొవిడ్‌-19 నియోనాటల్‌ సెప్సిస్‌ చికిత్స అందించారు. చిన్నారికి టీసీసీలో ఎక్స్‌ప్రెస్‌ బ్రెస్ట్‌మిల్క్‌ ఇచ్చారు. యాంటీబయాటిక్స్‌, ఐవీఎఫ్‌ ఫార్ములాపై చికిత్స చేసిన అనంతరం కొవిడ్‌ నెగెటివ్‌ పరీక్ష అనంతరం తక్కువ బరువుతో పుట్టినందున చికిత్స చేసేందుకు మళ్లీ వాణీ విలాస్ దవాఖానలోని నియోనేటల్ ఐసీయూకు తరలించారని బెంగళూరు మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ ప్రొఫెసర్‌, హెడ్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పిడిట్రిక్‌ మల్లేశ్‌ కే తెలిపారు. వైరస్‌ నుంచి కోలుకున్నాక భావోద్వేగ మద్దతు కోసం చిన్నారికి పాలు పట్టేందుకు తల్లిని దవాఖానకు పిలిపించారు.

శిశువు హైపోగ్లైసీమియా (తక్కువ రక్తంలో చక్కెర), హైపోకాల్కెమియా (తక్కువ కాల్షియం స్థాయిలు) తో బాధపడుతుందని బీఎంసీఆర్‌ఐ అసిస్టెంట్‌ ప్రొఫెసర్ డాక్టర్ రవిచంద్ర తెలిపారు. చిన్నారి మొదట్లో తేలికపాటి శ్వాసకోశ సమస్యలతో బాధపడగా ఆక్సిజన్‌పై ఉంచినట్లు తెలిపారు. అనంతరం తక్కువ బరువు కలిగిన శిశువుకు ప్రామాణిక చికిత్స అందించారు. ఎన్ ఐసీయూలో తల్లిపాలతో పాటు అనుబంధ ఫ్లూయిడ్స్‌ ఇచ్చినట్లు పేర్కొన్నారు. డిశ్చార్జి సమయంలో చిన్నారి 1.2 కిలోలకు బరువు ఉందని, తల్లిపాలు ఎలా ఇవ్వాలో తల్లిదండ్రులకు అవగాహన కల్పించినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో చిన్నారికి ఎదుగుదల, మెదడు అభివృద్ధి, కంటి, చెవి తదితర పరీక్షలు చేయనున్నట్లు వివరించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo