సోమవారం 30 నవంబర్ 2020
National - May 31, 2020 , 14:26:17

ఏపీలో కొత్తగా 98 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 98 కరోనా కేసులు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు అధికమవుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా 98 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3042కు చేరింది.  ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 2135 మంది కోలుకోగా, 845 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరో 62 మంది మరణించారు. కరోనా వైరస్‌తో ఈ రోజు చనిపోయిన వారిలో కృష్ణా, చిత్తూరు జిల్లాలకు చెందినవారు ఉన్నారు.