గురువారం 09 జూలై 2020
National - Jun 30, 2020 , 19:30:15

క‌ర్ణాట‌క‌లో క‌రోనా విజృంభ‌ణ‌

క‌ర్ణాట‌క‌లో క‌రోనా విజృంభ‌ణ‌

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభించింది. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే అక్క‌డ‌ కొత్తగా 947 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 15 వేల మార్కును దాటి 15,242కు చేరింది. మంగ‌ళ‌వారం న‌మోదైన మొత్తం కేసుల‌లో ఒక్క బెంగ‌ళూరులోనే 503 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. ఇక క‌ర్ణాట‌క‌లో క‌రోనా కార‌ణంగా సంభ‌విస్తున్న మ‌ర‌ణాల సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతున్న‌ది. మంగ‌ళ‌వారం కొత్త‌గా 20 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌డంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 246కు చేరింది. 

కాగా, క‌ర్ణాట‌క‌లో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం కేసులలో 7,918 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అయిన‌వారు, మ‌ర‌ణించిన‌వారుపోగా మొత్తం కేసుల‌లో ప్ర‌స్తుతం 7,074 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారంతా రాష్ట్రంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. క‌ర్ణాట‌క ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.   


logo