గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 16:31:16

'క‌జిరంగా'లో వ‌ర‌ద‌లు.. 96 జంతువులు మృతి!

'క‌జిరంగా'లో వ‌ర‌ద‌లు.. 96 జంతువులు మృతి!

గువాహ‌టి: అసోంలో భారీ వర్షాలు, వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో గ‌త కొన్ని రోజులుగా వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో వ‌ర‌ద‌లు పోటెత్తాయి. ప‌లు ప్రాంతాలు నీట మునిగాయి. బొకాహ‌ట్‌లోని క‌జిరంగా నేష‌న‌ల్ పార్క్‌, టైగ‌ర్ రిజ‌ర్వ్‌ను కూడా వ‌ర‌ద‌లు ముంచెత్తాయి. ఈ వ‌ర‌ద‌ల్లో చిక్కుకుని పార్కులోని 96 జంతువులు మృతిచెందాయి. వాటిలో ఎనిమిది రైనోలు, మూడు అడ‌వి దున్న‌లు, ఏడు అడ‌వి పందులు, స్వాంప్ డీర్‌లు, 74 హాగ్ డీర్‌లు, రెండు ముండ్ల పందులు ఉన్నాయి. అసోం ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo