శనివారం 06 జూన్ 2020
National - May 15, 2020 , 16:05:31

కరోనాను జయించిన 94 ఏండ్ల బామ్మ

కరోనాను జయించిన 94 ఏండ్ల బామ్మ

ముంబై: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఇప్పటికే ఈ మహమ్మారి బారినపడి ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా మరణించారు. దేశంలోనూ దాదాపు లక్ష మంది కరోనా వైరస్‌ బారినపడ్డారు. రెండు వేల ఐదు వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మహమ్మారి చిన్నారులు, వృద్ధులపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నదని వైద్యులు చెబుతున్నారు. మిగతా వారితో పోల్చితే వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఒక 94 ఏండ్ల వృద్ధురాలు తాజాగా కరోనా మహమ్మారిని జయించింది. ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలడంతో సంగ్లీలోని మిరాజ్‌ హాస్పిటల్‌లో చేరిన ఆమె వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని గురువారం సాయంత్రం డిశ్చార్జి అయ్యారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo