బుధవారం 27 మే 2020
National - May 15, 2020 , 20:23:37

ఒక్కరోజే కొత్త‌గా 933 పాజిటివ్ కేసులు..

ఒక్కరోజే కొత్త‌గా 933 పాజిటివ్ కేసులు..

ముంబై: ముంబైలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ వంద‌ల సంఖ్య‌లో పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇవాళ ఒక్క రోజే 933 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 24 మంది మృతి చెందారు. తాజా కేసుల‌తో ముంబైలో న‌మోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 17512కు చేరుకుంది.

ఇప్ప‌టివ‌ర‌కు 4558 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌యిన‌ట్లు బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పోరేష‌న్ వెల్ల‌డించింది. మ‌హారాష్ట్ర‌లో న‌మోదవుతున్న కేసుల్లో అత్య‌ధికంగా ముంబై నుంచి ఉన్నాయి. క‌రోనా వ్యాప్తి అంత‌కంత‌కూ పెరిగిపోతుండ‌టంతో పోలీసులు ఇప్ప‌టికే 144 సెక్ష‌న్ ను కూడా విధించారు.  

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo