శనివారం 30 మే 2020
National - May 17, 2020 , 18:19:00

93 రైళ్ళు... లక్షమంది ప్రయాణికులు...

93 రైళ్ళు... లక్షమంది ప్రయాణికులు...

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (ఎస్‌సీఆర్‌) జోన్‌ మే 1 నుంచి మే 17 వరకు 93 శ్రామిక్‌ స్పెషల్‌  రైళ్లను నడిపింది, మొత్తం 1.18 లక్షల మంది ప్రయాణికులను దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వారి సొంత పట్టణాలకు తీసుకువెళ్ళింది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ కారణంగా రైలు సర్వీసులు నిలిపివేయబడినందున, తెలంగాణలోని లింగంపల్లి నుండి జార్ఖ్‌ండ్‌లోని హటియాకు 1,200 మంది వలస వచ్చిన వారితో మొదటి రైలు నడిపినట్లు ఎస్‌సీఆర్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అప్పటి నుంచి (మే 1), మే 17 వరకు, ఈ జోన్‌ మొత్తం 93 శ్రామిక్‌ ప్రత్యేక రైళ్ళను వలస కార్మికుల కోసం నడిపినట్లు తెలిపింది. ఈ రైళ్లు తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర రాష్ర్టాల్లో ఎస్‌సీఆర్‌ అందించే వివిధ ప్రదేశాల నుంచి సేవలందించాయి. బీహార్‌, జార్ఖ్‌ండ్‌, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గడ్‌, పశ్చిమ బెంగాల్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌లకు ఈ ప్రత్యేక రైళ్ళు నడిచాయి. అలాంటి రైళ్లలో  బీబీనగర్‌ నుండి మణిపూర్‌లోని జిరిబామ్‌ వరకు 2,871 కిలోమీటర్ల దూరం ప్రయాణించే అత్యంత దూరపు రైలు ఉంది. ప్రయాణీకుల థర్మల్‌ స్క్రీనింగ్‌, బోగీలను శుభ్రపరచడం వంటి అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు, ప్రయాణంలో ప్రయాణీకులకు ఉచిత భోజనం, నీరు ఇచ్చారు. ప్రయాణికులకు భద్రత ఉండేలా రైళ్లలో పోలీసులను మోహరించినట్లు ఎస్‌సీఆర్‌ తెలిపింది. లక్ష మందికి పైగా ప్రయాణికులను చేరవేసిన ఘనతను సాధించడంలో జోన్‌ అధికారులు, సిబ్బంది శ్రమను జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా అభినందించారు.logo