బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 20:50:22

కేరళలో కొత్తగా 927 కరోనా పాజిటివ్‌ కేసులు

కేరళలో కొత్తగా 927 కరోనా పాజిటివ్‌ కేసులు

తిరువనంతపురం : కేరళలో ఆదివారం కొత్తగా 927 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, ఇద్దరు మృతి చెందారని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. వైరస్‌ వ్యాప్తి చెందుతున్న క్రమంలో నివారణకు కొత్తగా వ్యూహాలపై చర్చించడానికి రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సమావేశం కానుంది. కొత్తగా నమోదైన కేసులతో ఇప్పటి వరకు 19,025 చేరుకోగా, 9,655 మంది చికిత్స పొందుతున్నారు. మరో 9,302 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు వైరస్‌ ప్రభావంతో 62 మంది మృతి చెందారు. కాగా, రాష్ట్రంలో ఆదివారం వైరస్‌తో తొమ్మిది మంది మరణిస్తే ప్రభుత్వ రికార్డులో 2 మరణాలు నమోదు చేశారు.

దీనిపై ఓ సీనియర్‌ అధికారిని వివరణ కోరగా కొన్ని కేసులను మినహాయించినట్లు పేర్కొన్నారు. వాటిని మరుసటి రోజు జాబితాలో నమోదు చేయనున్నట్లు సమాచారం. కాగా, రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో 175 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ట్రిపుల్‌ లాక్‌డౌన్‌ చాలా ప్రాంతాల్లో అమలులో ఉంది. రాష్ట్రంలో కనీసం 1,56,162 మంది పరిశీలనలో ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కార్యాలయం తెలిపింది. మరో 29 ప్రాంతాలు హాట్‌స్పాట్లుగా మార్చడంతో పాటు 495 కంటైన్‌జోన్లు ఏర్పాటు చేశారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo