మంగళవారం 26 మే 2020
National - May 16, 2020 , 09:51:01

రాజస్థాన్‌లో కొత్తగా 91 కరోనా కేసులు

రాజస్థాన్‌లో కొత్తగా 91 కరోనా కేసులు

జైపూర్‌: రాజస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 91 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4838కి పెరిగింది. ఇందులో 1941 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఈ ప్రాణాంతక వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటివరకు 125 మంది మరణించారని ఆరోగ్యశాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో జైపూర్‌లో 55, దుంగార్పూర్‌లో 21, ఉదయ్‌పూర్‌లో 9 చొప్పున ఉన్నాయి. 

దేశంలో ఇప్పటివరకు మొత్తం 85940 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవగా, 2752 మంది మరణించారు. గత 24 గంటల్లో 3970 కేసులు కొత్తగా నమోదయ్యాయి. 


logo