బుధవారం 03 జూన్ 2020
National - Apr 03, 2020 , 18:13:45

ఢిల్లీలో కొత్త‌గా 91 మందికి క‌రోనా

ఢిల్లీలో కొత్త‌గా 91 మందికి క‌రోనా

న్యూఢిల్లీ: మ‌ర్క‌జ్ నిజాముద్దీన్‌లో త‌బ్లీగి జ‌మాత్ నిర్వ‌హించిన మ‌త‌ ప్రార్థ‌న‌లు దేశంలో క‌రోనా మ‌ర‌ణాలు విప‌రీతంగా పెరుగ‌డానికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌య్యాయి. అన్ని రాష్ట్రాల‌తోపాటు ఢిల్లీలోనూ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న‌ది. అయితే కొత్త‌గా న‌మోద‌వుతున్న కేసుల్లో ఎక్కువ‌గా ఢిల్లీ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న‌వారే ఉంటున్నారు. కాగా, శుక్ర‌వారం ఒక్క‌రోజే ఢిల్లీలో కొత్త‌గా 91 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 384కు చేరింది. ఈ వివ‌రాల‌ను ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రివాల్ శుక్ర‌వారం సాయంత్రం మీడియాకు వెల్ల‌డించారు. 

కొత్త‌గా న‌మోదైన 91 కేసుల్లో 58 మంది విదేశాల‌కు చెందిన‌వారేన‌ని ఢిల్లీ సీఎం చెప్పారు. ఢిల్లీలో న‌మోదైన మొత్తం 384 క‌రోనా కేసుల్లో 259 మంది మ‌ర్క‌జ్ ప్రార్థ‌న‌ల్లో పాల్గొన్న‌వారేన‌ని కేజ్రివాల్ తెలిపారు. ఢిల్లీ వ్యాప్తంగా 328 పునర‌వాస కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌ని, ఆశ్ర‌యం లేనివారు ఎవ‌రైనా ఈ పున‌రావాస కేంద్రాల‌కు వ‌చ్చి ఉండ‌వ‌చ్చ‌ని ఆయ‌న సూచించారు.    

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు.. 


logo